బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైఫ్ భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు.
కరీనా కపూర్ ఖాన్ గురువారం తెల్లవారుజామున తమ బాంద్రా నివాసంలో భర్త సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడిని వివరించారు. అగంతకుడు సైఫ్‌ను పదేపదే కత్తితో పొడవడం తాను చూశానని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి చాలా ఆవేశంతో ఉన్నాడని.. అతను సైఫ్‌పై పదే పదే దాడి చేశాడని చెప్పారు. సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యత అని ఆమె పోలీసులకు తెలిపారు.
అక్కడి నుంచి అగంతకుడు పారిపోయాడని.. ఇంట్లో వస్తువులను దొంగిలించలేదని చెప్పారు. సైఫ్ వారి పిల్లలు తైమూర్ , జెహ్‌ని కాపాడాలని ప్రయత్నించారని.. దాడి చేసిన వ్యక్తిని జెహ్ దగ్గరకి వెళ్లనీయకపోవడంతో, అతను ఖాన్‌పై చాలాసార్లు దాడి చేశాడని కరీనాకపూర్ చెప్పారు.
సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భయాందోళనకు గురైన కరీనా కపూర్ తన సోదరి కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లారు. సైఫ్ అలీఖాన్‌కు లీలావతి ఆస్పత్రిలో వైద్యులు సర్జరీలు చేశారు.
తాను దాడి తర్వాత చాలా భయపడడంతో తన సోదరి కరిష్మా కపూర్ తన ఇంటికి తీసుకెళ్లినట్టు కరీనాకపూర్ వెల్లడించారు.
ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన నివాసంలో గురువారం ఒక ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు సద్గురు శరణ్ భవనంలోని 11వ అంతస్తులో ఉన్న ఖాన్ ఇంట్లో చోరీ కోసం ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. దాడి తర్వాత తీవ్ర రక్తస్రావంతో ఉన్న సైఫ్‌ను సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసిన వైద్యులు సైఫ్ అలీఖాన్ శరీరంలో వెన్నుముకకు సమీపంలో ఉన్న కత్తి ముక్కలను తొలగించారు.