15.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

‘టైగర్-3’ అత్యంత ప్రమాదకరమైన మిషన్: సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ ట్రైలర్ రాబోతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించిన ‘టైగర్ 3’ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలను ఆడియెన్స్ ఇప్పటికే చూసి విజయవంతం చేశారు. ఇప్పుడు టైగర్ 3తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఈ మూవీ చాలా ప్రత్యేకం. ఇది వరకు ఇండియన్ సినిమాలో చేయని, చూడని యాక్షన్ సీక్వెన్స్‌ను టైగర్‌ 3లో నాతో చేయించారు. ఇంత భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసే టైంలో సెట్స్‌లో నేను చిన్న పిల్లాడిని అయ్యాను.. ఎంతో ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాను. టైగర్ 3 ట్రైలర్ వచ్చినప్పుడు ఆ విషయం మీకు కూడా అర్థం అవుతోంది. అద్భుతమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. ‘టైగర్ 3 కథ ఎలా ఉండబోతోంది.. ఎలాంటి ట్విస్టులు ఉండబోతోన్నాయి.. ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందన్న విషయాలు ప్రేక్షకుల ఊహకు అందవు. గ్రిప్పింగ్‌గా కథ, కథనాలుంటాయి. టైగర్ 3 కథ విన్న వెంటనే నాకు నచ్చింది. ఇదే టైగర్ చేసే అత్యంత ప్రమాదకరమైన మిషన్ కానుంది.’’ అని తెలిపారు.

టైగర్ 3 ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ మూవీని ఆదిత్య చోప్రా తమ స్పై యూనివర్స్‌‌లో భాగంగా అద్భుతంగా నిర్మించారు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్‌లకు ఏ మాత్రం తగ్గకుండా టైగర్ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్