చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని వదిలేది లేదని మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల. ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుం టామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని పనిలోకి తీసుకో వాలన్నా రు. గంజాయి, డ్రగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. బాధిత కుటుం బాన్ని అన్ని విధాలా అదుకుంటుందన్నారు. ప్రభుత్వం తరుపున రెండున్నర లక్షల, రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇల్లు, ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.


