స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ను గెలిపించేందుకే తెలంగాణలో పవన్ పోటీ చేస్తున్నాడని పేర్ని నాని విమర్శలు చేశారు. తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్న చోటే ఎందుకు పోటీ చేస్తున్నావ్ పవన్ ? అని మండిపడ్డారు. కేసీఆర్ కోసం, మున్నూరు కాపుల ఓట్లను చీల్చడం కోసమే పోటీ చేస్తున్నాడని పేర్ని నాని లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణాలో లాగా ఏపీలో ఎందుకు ఒంటరిగా పోటీ చేయవంటూ ఆగ్రహించారు.
బీజేపీతో సంప్రదించే అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పావా..? ఎన్డీఏలో ఉండి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎరికి మద్దతిచ్చావ్ పవన్..? అని నిలదీశారు. ఏపీలో కాపుల ఓట్లున్న చోటే వారాహి యాత్రలు ఎందుకు చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డారు పేర్ని నాని. పవన్ ఐదు రోజుల పాటు కృష్ణాలో ఆటవిడుపు యాత్ర చేశారని, ఆయన మాటలు జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నారు. జగన్‌కు దమ్ముందని, అందుకే ఏ పార్టీతోనూ పొత్తుతో వెళ్లడం లేదన్నారు. పవన్ లా జగన్ రోజుకో పార్టీ మార్చరన్నారు. అవనిగడ్డలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పిన జనసేనాని, ముదినేపల్లిలో తిరిగి అందులోనే కొనసాగుతున్నట్లు చెప్పారన్నారు.