రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు ఏటా ఒకేలా ఉంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. ఆ ప్రసంగంలోని అంశాలు ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన “అదే లాండ్రీ జాబితా” అని అన్నారు.
రాహుల్ ప్రసంగంలో ముఖ్య అంశాలు
1.. మనదేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాం. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీయేలు ఉపాధి కల్పన గురించి దేశ యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి.
2..ఇప్పటికైనా తయారీపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. దేశంలో సామాజిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
3..ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోకపోవడం వల్ల చైనా ఇక్కడ మకాం వేసింది. తయారీలో మనం విఫలమై, చైనాకు అప్పగించాం.
4..మేకిన్ ఇండియా మంచి ఆలోచనే అయినప్పటికీ దాన్ని అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు.
5..అమెరికా అధ్యక్షుడి ‘పట్టాభిషేకం’కు మన ప్రధానిని ఆహ్వానించడానికి విదేశాంగ మంత్రిని అమెరికాకు పంపాము.
6..మేము తెలంగాణలో ఒక కుల సర్వే చేశాము. రాష్ట్రంలో దాదాపు 90 శాతం దళితులు, గిరిజనులు, వెనుక బడిన వారు, మైనారిటీలు ఉన్నారు.
7..ఈ దేశంలో అతిపెద్ద సంస్థలు ఉన్న వారిలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు లేరు
8..రాజ్యాంగం ఎల్లప్పుడూ భారతదేశాన్ని పరిపాలిస్తుంది.
9.. నాలుగు సాంకేతిక పరిజ్ఞానాల వల్ల మొబిలిటీలో మార్పు – ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు, ఆప్టిక్స్ ,AI అప్లికేషన్.
10..కుల జనాభా గణనను పూర్తి చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి నమూనా యొక్క నిర్మాణాన్ని నిర్మించవచ్చు.