కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా లక్షన్నర లోపు రుణాలు ఉన్న అన్నదాతల రుణాలు మాఫీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారాయన. 6 లక్షలా 40 వేల 823 మంది రైతులకు దీని ద్వారా లబ్ది కలగనుంది. మొత్తం 6వేల 190 కోట్ల రూపాయలను రేవంత్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసింది.
రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తుమ్మల. తమది రైతు ప్రభుత్వమన్న ఆయన.. ఆగస్ట్ 15లోపు రెండు లక్షల రుణాలు ఉన్న కర్షకులకూ రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రైతు భరోసా విధివిధానాలు వెల్లడిస్తామన్నారు మంత్రి తుమ్మల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు.


