స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు టెట్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు నిర్వహిచనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణపై మంత్రి వర్గ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించారు.
బీఈడీ అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై రూపొందించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. అభ్యర్థులు టెట్ వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in …పరీక్ష ఫీజు రూ. 400 చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16, 2023
* రాతపరీక్ష: సెప్టెంబర్ 15, 2023
* పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
* పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
* పరీక్ష ఫీజు: రూ.400
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్ 27, 2023
* పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in/