వినుకొండ వెళుతున్న మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బయలు దేరిన వైసీపీ నాయకుల వాహనాలను నిలిపివేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలు దేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిపివేశారు.