25.8 C
Hyderabad
Monday, March 31, 2025
spot_img

పది వారాల కూలీ పెండింగ్….రూ. 90 కోట్ల బకాయిలు – కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ కూలీల వెతలు

ఒకటి కాదు రెండు కాదు, వేలు కాదు, లక్షలు కాదు… అక్షరాలా 90 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎవరికి..? పూట పూట సాపాటు కోసం కాయకష్టం చేస్తూ.. ఎండనక, వాననక అహర్నిశలు శ్రమించే ఉపాధి హామీ కూలీలకు. పది వారాలుగా కూలీ పెండింగ్ పెట్టేస్తే.. ఆ అభాగ్యులు తిండికి నోచుకోక అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ…మండుటెండల్లో శ్రమిస్తుంటే…. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద కడుపునిండిన పెద్దలు కునికిపాట్లు పడుతున్నారా..? ఇదీ కర్నూలు జిల్లా నిరుపేదల ప్రశ్న.

రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఆటపాటలు సంబరాల్లో తేలియాడుతున్నారు. తలమునకలైన పనులు, క్షణం తీరిక లేని ప్రజాసేవ చేసే పాలకులు మానసిక వికాసానికి సాంస్కృతిక, సరదా కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పుకాదు. అయితే, మండుటెండల్లో మాడిపోతూ.. గునపాలు చేతపట్టి.. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా మట్టి తవ్వే శ్రామికులు, మట్టి తట్టలు చేతపట్టి గోతులు, గోడలు, రాళ్లు, రప్పలు ఏవీ పట్టించుకోకుండా, కాళ్ల నెప్పులు, కీళ్ల నెప్పులు ఉన్నా భరిస్తూ.. అవిశ్రామంగా పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు.. ఎంత ఇచ్చినా తక్కువే. అలాంటిది.. ఇవ్వాల్సిన కూలిడబ్బులే నెలలతరబడి ఇవ్వకుండా.. ఈ తీరున ప్రవర్తించడం ఏమిటని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మరోవైపు అధికారులను మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు మండుటెండల్లో పనులు చేస్తున్నారు. అయితే, కూలీలు పనులు చేపట్టి 90 రోజులు గడుస్తోంది. పనులు సెంచరీకి దగ్గరైనా.. చెల్లించాల్సి కూలీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. రోజువారి వేతనాలతోపాటు, మెటిరియల్ కాంపోనెట్ కింద 90 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఈ శ్రమ దోపిడీ ఏమిటో అర్థం కావడం లేదని, 90 రోజులు గడుస్తున్నా కూలి డబ్బులు ఖాతల్లో జమ కాకపోతే ఆకలితో డొక్కలు మాడ్చుకుని.. పనులెలా చేయగల్గుతామని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇక్కడ లాభం లేదు…ఉపాధి కొసం వేరే రాష్ట్రాలకు వెళ్లాలేమో అని ఉపాధి హామీ కూలీలు ఆలోచనలో పడ్డారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశం.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు అభివద్ది చేసే పనుల ద్వారా కూలీలకు వేతన ఉపాధిని కల్పించాలి. ప్రజల జీవన భద్రతపెంపొందించాలి. ఈ పథక లక్ష్యం పాలకులు, అధికారుల తీరుతో నీరు కారిపోతోంది. అయితే ఈ ఏడాది జనవరి నెల నుంచి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట పనులు చేస్తోన్న కూలీలకు పదివారాలు నుంచి కూలీ డబ్బులు రాలేదు. దీంతో, ఉపాధి హామీ కూలీలు, వారి కుటుంబీకులు త్రీవ అర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళ్లు కాలుతున్నా, నెత్తి మాడుతున్నా…మండుటెండల్లో నిర్విరామంగా పనులు చేసే కూలీలకు బకాయిలు పెండింగ్ పెట్టడమే కాకుండా, ఆ అవిశ్రామ శ్రామికులకు పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించడంలో సైతం పాలక ప్రభువులు, అధికార సారులు ఘోరంగా విఫలం అయ్యారు.

కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, అదోని, అలూరు, పత్తికొండ, పాణ్యం నియెజకవర్గాల పరిధిలో 25 మండలాలు ఉన్నాయి. ఇందులో.. 484 గ్రామ పంచాయితీలు, 237 మజరా గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఈ పథకం కింద దాదాపు 3 లక్షల 35 వేల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు జాబ్ కార్డులు ఉన్నాయి. జిల్లాలో 2024_25 సంవత్సరములో 99 లక్షల పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం. ఈ పథకం అమలు కొసం జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పనులు చేపట్టతున్న ప్రాంతాలను క్లస్టర్ గా విభజించింది. ఒక్కొక్క క్లస్టర్ కింద అయిదు మండలాలు ఉన్నాయి. ప్రతిమండలములో 2,500 మంది నుంచి 7 వేల మంది వరకు ఉపాధి పని కల్పించాలన్నది లక్ష్యం. వేతనాల సకాలంలో చెల్లించకపోవటంతో అయిదు మండలాల పరిధిలో 60 వేల మంది కి మించి ఉపాధి పనులకు రాలేకపోతున్నారు. కారణం ఒక వ్యక్తికి సగటున 250 నుంచి 300 రూపాయల లోపే కూలీలకు వస్తోంది. రోజువారీ కూలీలు గత పది వారాలుగా చెల్లించటంలేదు. ఇందులో పనులకు హాజరయ్యే వారు కేవలం 2 లక్షల 11 వేల మంది మాత్రమే ఉన్నారు. వేతనాలు రాకపోవడంతో ఈ పథకంపై కూలీలు ఆశలు కొల్పోవల్సివస్తోంది.

జిల్లాలో ఉపాధి వేతనాల రూపంలో 40 కోట్ల రూపాయలు, మెటీరియల్ కాంపోనెట్ పేరిట 50 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గ్రామీణ ప్రాంతాలల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజి, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిచిపోయాయి. మినీ గోకులం, సీసీ రోడ్లు, హార్టికల్చర్ పనులు, ఫీడ్ ఛానల్స్, ఫారమ్ పాండ్స్ పేరిట భారీ ఎత్తున పనులు జరిగాయి. బిల్లుల పెండింగ్ పై ఇటు ఉపాధి హామీ కూలీలు, అటు కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

‘మనంసైతం’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్