పంచాయితీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంట్ కి పంపిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కిందని కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు అన్నారు.బీసీ మంత్రులు.ప్రజా ప్రతినిధులు అభినందన సభలో ముఖ్య అతిథిగా విచ్చేశారు.బీసీలు ఐక్యత గా ఉంటే ఎంతో అభివృద్ధి ఉంటుంది అని చెప్పారు.గత ప్రభుత్వ హయంలో బీసీ లకు చీకటి రోజులని మంత్రి ఆచ్చెయ్య నాయుడు అన్నారు బీసీలకు బడ్జెట్ లో ఒక్క రూపాయి ఇవ్వకుండా ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలే టిడిపి కి అండగా ఉంటున్నారని కేసులు పెట్టి అరెస్టు లు చేయించారని గతం గుర్తు చేశారు.బీసీలకు ఎన్టీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత సిఎం చంద్ర బాబు నాయుడు ఇస్తున్నారని అభిప్రాయ వ్యక్తం చేశారు.