స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎస్సై, ఏఎస్సై రాతపరీక్ష తుది కీ మే 10న రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. మార్చి 11న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై.. 26న జరిగిన పీటీవో ఎస్సై.. ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ.. 9న జరిగిన జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల కీని విడుదల అయింది. పరీక్ష ప్రాథమిక కీని www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైన ఏవైనా అభ్యంతరాలు ఉంటె మే 14న సాయంత్రం 5 గంటల్లోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.