రేపు విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం రానున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణుల కమిటీ రానుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా అడ్డుకోవాలని భావిస్తున్న కేసీఆర్(KCR) సర్కారు… విశాఖ ఉక్కు నిర్వహణకు మూలధనం, ముడిసరకుల కోసం నిధులు ఇవ్వడానికి సిద్ధం అయింది. ఈ మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న బిడ్డింగ్లో రాష్ట్ర సర్కారు పాల్గొనేందుకు నిర్ణయించింది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ కు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) కార్మిక సంఘాలకు ఈఓఐపై యాజమాన్యం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. వసతులు లేక తీవ్ర ఇక్కట్లు
Follow us on: Youtube, Instagram, Google News