Rachakonda CP Chauhan |మీరు కమిషనర్ అయితే నాకేంటి.. నా విధులు నేను నిర్వర్తిస్తున్నా.. ఐ డోంట్ కేర్. పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీకి వచ్చిన రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ ను ఓ మహిళా కానిస్టేబుల్ అన్న మాటలు ఇవి. సరూర్ నగర్(Saroornagar) లోని ఓ ప్రభుత్వ స్కూల్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రం లోపలికి కమిషనర్ చౌహాన్ తనిఖీకి వెళ్లబోయారు. అంతే అక్కడ గేట్ బయట డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆయనను లోపలికి వెళ్లనీయకుండా ఆపేసింది. పేపర్ లీకుల నేపథ్యంలో పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. దీంతో కమిషనర్(Rachakonda CP Chauhan) ఆమెకు మొబైల్ ఇచ్చి లోపలికి వెళ్లారు. తనఖీ అనంతరం బయటకు వచ్చిన కమిషనర్ ఆమె పనితీరును అభినందించి అక్కడికక్కడే రివార్డు కూడా అందజేశారు.
Read Also: భార్య మరణాన్ని తట్టుకోలేక రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై
Follow us on: Youtube, Instagram, Google News