Preethi Death Case |కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ప్రీతి స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్(Saif) రిమాండ్ రిపొర్టులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
సైఫ్ ఫోన్ లో నుండి 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనస్థీషియా విభాగంలో ప్రీతిని సూపర్ వైజ్ చేస్తున్న సీనియర్‌గా సైఫ్ ఉన్నారు. అయితే రెండు ఘటన ల ఆధారంగా ప్రీతి పై సైఫ్ కోపం పెంచుకున్నాడని రిమాండ్ రిపొర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Preethi Death Case | డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేస్ విషయం లో ప్రీతి నీ గైడ్ చేశారు సైఫ్. ఆ ఘటన లో ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టును ప్రీతి రాసింది. అయితే ప్రీతి రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూప్ లో పెట్టి హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడు. అయితే తనతో ఏమైనా సమస్య ఉందా అంటూ సైఫ్ ను ప్రశ్నించింది ప్రీతి. ఏమైనా సమస్య ఉంటే హెచ్ ఓ డి కి చెప్పాలని సైఫ్ కు ప్రీతి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత తన స్నేహితుడు భార్గవ్ కు ప్రీతిని వేదించాలని సైఫ్ చెప్పినట్లు తెలుస్తోంది.
RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ సూచించాడు. అయితే సైఫ్‌పై గత నెల 21వ తేదీన హెచ్ ఓ డి నాగార్జునకి ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకల, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సైఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు వైద్యులు. అయితే మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.