తెలంగాణాలో నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనను శ్రీకారం చుట్టేందుకు . మోడీ నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. రూ.720 కోట్ల నిధులతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనితో పాటుగా హైదరాబాద్-సికింద్రాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో కొత్త సబర్బన్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో 28 కిలోమీటర్ల మేర రైలు ప్రయాణం సాగనుంది. లాలాగూడ గేట్, మాల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ, ఆర్కేపురం, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి, శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నాయి. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ విద్యుదీకరణనూ ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జాతికి అంకితం చేయనున్నారు.
Read Also: ఇకపై తెలంగాణలో అన్ని వేళల్లో షాపులు… ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Follow us on: Youtube, Instagram, Google News