స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సాధారణ స్థితిలో బీపీ, షుగర్ లెవెల్స్ ఉన్నాయి. వడదెబ్బ తగలడం వల్ల డీ హైడ్రేషన్ ను గురికావడంతో.. తగిన విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. గత కొద్దీ రోజులుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి విక్రమార్కకు వడదెబ్బ కారణంగా శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.