ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavita)తో చేసిన వాట్సాప్ చాట్ లేఖ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సుకేశ్ లేఖపై ఈడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కవిత, సుకేశ్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను ఆధారాలుగా చూపించారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణపై విచారణ చేయాలని ఆయన ఈడీ అధికారులను కోరారు. కాగా ఎమ్మెల్సీ కవితతో చేసిన వాట్సాప్ చాట్ అంటూ స్క్రీన్ షాట్స్ తో కూడిన ఆరు పేజీల లేఖను జైలు నుంచి సుకేశ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. ‘కవిత’తో వాట్సాప్ చాట్ బయటపెట్టిన సుఖేశ్