25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డ్

భవిష్యత్ లో అధిక రాబడుల కోసం ఆస్తులు, వ్యాపారాల్లో సొమ్ము పెట్టడమే పెట్టుబడి. ఈ పెట్టుబడులు ఎన్నో రూపాల్లో ఉంటాయి. అయితే, రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాలక పెద్దలు చేసే ప్రయత్నాల్లో భాగంగా బడా సంస్థల నేతలను పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తారు. ఆయా సంస్థల వ్యాపారాభివృద్ధికి దోహదపడే ఇక్కడి అనువైన పరిస్థితులను వివరించి అంతర్జాతీయ వ్యాపార, పారిశ్రామిక, ఐటీ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరపడానికి పాలక పెద్దలు విదేశీ పర్యటనలు సాగిస్తారు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు…తమ తమ రాష్ట్రాల అభివృద్ధికోసం, విద్యావంతులు, నిరుద్యోగుల ఉపాధి కోసం..విదేశీ పర్యటన సాగించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన సాగించారు. స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు.. తమ తమ మంత్రులు, ఉన్నతాధికార బృందాలతో తరలివెళ్లి.. ఆ సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం దావోస్ పర్యటన సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది.

ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుని తెలంగాణ బృందం దుమ్మురేపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40 వేల 232 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాగా, ఇప్పుడు ఇంత భారీస్థాయిలో పెట్టుబడుల అంగీకారాలు జరిగాయి. దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ నెలకొల్పిన సరికొత్త రికార్డులపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇవే భారీ పెట్టుబడులని, వీటితో రాష్ట్రంలో కొత్తగా 49 వేల 500 మందికి ఉద్యోగాలు వస్తాయని పాలక పెద్దలు తెలిపారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మూడు కంపెనీల పెట్టుబడి 24 వేల 500 కోట్ల రూపాయలు. విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే చెప్పగా, వీటిలో 22 వేల కొలువులు వస్తాయని వెల్లడైంది. సంగారెడ్డి లో సుహానా ప్రపంచస్థాయి ఎక్స్ లెన్స్ సెంటర్, హైదరాబాద్ లో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ ఒప్పందాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే.. నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని నేతలు తెలిపారు. ఆర్థికాభివృద్ది, ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్రం ముందుకు సాగడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయమని, ఇందుకు విశేషంగా కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, ఉన్నతాధికారుల బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ బృందం పలువురు పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలతో నిర్వహించిన సమావేశాలన్నీ సక్సెస్ అయ్యాయి.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యం ఇవ్వడం, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విషయంలో సర్కారు ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికల వల్ల పెట్టుబడులు వెల్లువెత్తాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సర్కారు అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించిందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణంగా పేరున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 10 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్టుగా భారీ పెట్టుబడులను సాధించింది.

ఏఏ కంపెనీలతో ఏ రీతిన ఈ విజయవంత చర్చలు జరిగాయని పరిశీలిస్తే…ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు యూనిలివర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అంగీకరించింది. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెజాన్ తో 60 వేల కోట్లరూపాయల పెట్టుబడుల ఒప్పందం జరగగా, 15 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ ను అభివృద్ది చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో ఒప్పందం జరిగింది. 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది.

ఇదేరీతిలో అయిదు వేల కోట్ల రూపాయలతో ఏఐ డేటా సంటర్, అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ఏర్పాటుకానున్నాయి. అదేవిధంగా మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ 7,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందం జరిగింది. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే గొప్ప పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ రాష్ట్రంలో తమ యూనిట్ ఏర్పాటుకు రెడీ అయ్యింది. దీనివల్ల 800 మంది విద్యాధికులకు ఉద్యోగాలు రానున్నాయి. ఇక ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విస్తరణతో 17 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ని క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలను ఈ కంపెనీ కల్పించనుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ కార్యాలయాల్లో దాదాపు 35 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారుల బృందం టూర్ విజయవంతం అయ్యింది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఆవిష్కరించారు. ఏపీ సర్కారు పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను సీఎం చంద్రబాబునాయుడు వివరించారు. దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ భేటీలు, సదస్సులు నిర్వహించారు. సిస్కో, ఎల్జీ కెమ్, కార్ల్స్ బెర్గ్ గ్రూప్, ఆర్సెల్లార్ మిట్టల్ ప్రా వెల్స్ పన్ కంపెనీలతో చర్చలు జరిపారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో, పెప్సికో సీఈవో యాజీన్ విల్లెంసెన్ తో, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో, యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్ స్టాపబుల్ గా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామని లోకేష్ తెలిపారు. కాగ్నిజెంట్ తో సమావేశమైన లోకేష్, అనంతరం ఈ సంస్థ నుంచి త్వరలో శుభవార్త వస్తోందని చెప్పారు. దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ మంచులో తడుస్తూ, సాధారణ వ్యక్తిలా రోడ్లపై తన బృందంతో కలిసి నడిచి వెళ్లారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీ అవకాశాల గని అని ఆయన దిగ్గజ పెట్టుబడిదారులందరికీ తెలిపి, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

అయితే, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బృందం దావోస్ పర్యటన ప్లాఫ్ అయ్యిందని వైసీపీ నేతలు తెలిపారు. పక్క రాష్ట్రం సీఎం వేలు, లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగివస్తే, చంద్రబాబు బృందం ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని వైసీపీ నేతలు విమర్శించారు. దావోస్ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, షూట్లకు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. కనీసం ఆ ఖర్చుల వరకైనా పెట్టుబడులు దక్కలేదని విమర్శించారు. లోకేష్ రెడ్ బుక్ ప్రస్థావనతో పారిశ్రామిక వేత్తల బెంబేలెత్తారని విమర్శలు గుప్పించారు.

Latest Articles

డ్యాన్స్ ను జయించిన క్యాన్సిల్…డామిట్ కథ అడ్డం తిరిగింది

నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి...కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్