హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.