Summer Holidays | తెలంగాణలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ తెలిపింది. నేటి నుండి మొదలుకొని జూన్ 1వ తేది వరకు ఎండాకాలం సెలవులు ప్రకటించింది. ఎండలు బాగా మండుతున్నందున విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేసింది ఇంటర్ బోర్డ్. వేసవి సెలవుల్లో ఏ కాలేజీ కూడా తెరవద్దని హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే విద్యార్థుల వద్ద నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టాలని వెల్లడించింది.
Read Also: రేపు రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్… 1500 మంది పోలీసులతో భారీ భద్రత
Follow us on: Youtube, Instagram, Google News