తెలంగాణాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి అభిషేక్ రెడ్డి(Abhishek Reddy) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అభిషేక్ రెడ్డిని ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రవేశం చేసి యాదాద్రి శ్రీ నృసింహ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ స్వామివారి విమాన గోపురం బంగారు తాపడం కొరకు అభిషేక్ రెడ్డి విరాళంగా రూ.1,00,116 ఇచ్చారు. పూజ కార్యక్రమాల అనంతరం అభిషేక్ రెడ్డి కుటుంబానికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అటు తర్వాత స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. మరోవైపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Read Also: V6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా..!!
Follow us on: Youtube Instagram