హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ పరీక్షాకేంద్రంలో టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు(Paper Leak Case)లో విద్యార్థి హరీశ్ కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. మిగిలిన పరీక్షలు రాసేందుకు విద్యార్థికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుంచి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. పేపర్ లీకు కేసులో విద్యార్థిని అధికారులు డిబార్ చేశారు. కాగా కుమారుడి డిబార్ ను సవాల్ చేస్తూ అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో తన కుమారుడు పరీక్ష రాసే సమయంలో బలవంతంగా పేపర్ లాక్కున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కమలాపుర్ లో పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో కూడా అతని పేరు ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..తృటిలో తప్పిన ప్రాణనష్టం
Follow us on: Youtube, Instagram, Google News