తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చిందని తెలిపారు. దీని ద్వారా రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నగరంలో ఆర్టీసీ బస్సులు.. ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఈటొ మోటర్స్ ఫ్లిక్స్ బస్, ఎలక్ట్రిక్ బస్సు మొదటిసారి ప్రారంభించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించిన అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.