తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
గతేడాది ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అప్పట్లో ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఫాక్స్ కాన్ కంపెనీ పనులను సీఎం పరిశీలించనున్నారు.


