తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 40 వేల 618 మంది విద్యార్థులు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు-ఎస్.జ్యోతిరాదిత్య,రెండో ర్యాంకు- హర్ష, మూడో ర్యాంక్-రిషి శేఖర్ శుక్లా,నాలుగో ర్యాంకు-సందేశ్,ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్ రెడ్డి సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంకు-ప్రణీత,రెండో ర్యాంకు-రాధాకృష్ణ, మూడో ర్యాంకు-శ్రీవర్షిణి,నాలుగో ర్యాంకు-సాకేత్ రాఘవ్, ఐదో ర్యాంకు- సాయి వివేక్ కి వచ్చింది.


