తెలంగాణ కెబినెట్ గురువారం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు బీసీ రిజర్వేషన్ ల సాధనకు కేంద్రంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న ఫ్యూహంపై చర్చించనుంది మంత్రివర్గం.
రాష్ట్రంలో బీసీ కులగణ రెండో విడత సర్వే పూర్తైయ్యింది. ఈనేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది. దీంతో పాటు ఎస్సి వర్గీకరణపై అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. దీంతో ఈరెండు ప్రధాన అంశాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ లపై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకు రావాలన్నదానిపై కూడా చర్చించబోతున్నారు. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్న దానిపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీల్లో బీసీ రిజర్వేషన్‌లు, ఎస్సి వర్గికరణపై చట్టం చేసిన తర్వాత.. అసెంబ్లీని వాయిదా వేసుకుని ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని ఆలోచిస్తుంది సర్కార్ . అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ముహూర్తం అన్నది కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారు.
ఇక బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించిన సర్కార్… ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడానికి, క్షేత్ర స్తాయిలో ఉన్న సమస్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడంపై కీలకమైన ఆదేశాలివ్వనుంది మంత్రివర్గం. రేషన్ కార్డులు పంఫిణిని లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం… ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోయిన నేపధ్యంలో…. రాష్ట్ర వ్యాప్గంగా కొత్త రేషన్ కార్డ్‌లను ఎప్పటి నుంచి.. ప్రారంభించాలన్న దానిపై మంత్రిర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీలో బడ్జెట్, ప్రభుత్వం తీసుకురానున్న ఇసుక పాలసీ, టూరిజం పాలసీలతో పాటు పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు.