స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భజరంగ్‌దళ్ సంస్థను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టడంపై తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించడానికి బీజేపీ నేతలు భారీగా బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్ చాలీసా పఠాయించారు. ఇక ఖమ్మం నగరంలో కూడా బీజేపీ శ్రేణులు చేపట్టిన కాంగ్రెస్ కార్యాలయం మట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటు హైదరాబాద్‌లోనూ గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.


