21.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

బీజేపీ హై కమాండ్ గుడ్ లుక్స్ లో బండి సంజయ్

ఎదుగుతున్న కొద్దీ శత్రువులు పెరుగుతారని అంటారు. రాజకీయాల్లో అయితే అదీ చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటుంది. మనల్ని దాటి ఎక్కడ ఎదిగిపోతాడోననే భయంతో అవకాశం వస్తే చాలు, తొక్కేద్దామని చూస్తుంటారు. దానికోసం ఎన్ని  కుయుక్తులైనా పన్నుతారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అతీతుడేం కాదని అంటున్నారు.

వివరాల్లోకి వెళితే…తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ కు శత్రువులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రావడమే వార్తల్లో మెరిశారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగగానే భాగ్యలక్ష్మీ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి బండి సంజయ్ చేసిన విన్యాసం కేసీఆర్ గుండెల్లోనే గుబులు పుట్టించింది. ఆ ఒక్క కార్యక్రమంతో పెద్ద హీరో అయిపోయారు బండి సంజయ్.

అయితే సమయస్ఫూర్తితో మాట్లాడటంతో బండి సంజయ్ రూటే వేరు. పంచ్ లపై పంచ్ లు విసరడంలో ఆయనది ఒక ప్రత్యేక స్టైల్ అని చెప్పాలి. ఇక బండి సంజయ్ ఎంట్రీకి ముందు కేసీఆర్ పై ఎదురుదాడి చేయడంలో రేవంత్ రెడ్డి ముందుండేవారు. కానీ బండి వచ్చాక ఆయన రెండోస్థానంలోకి వెళ్లిపోయారు. రెండవది ఆయన కూడా ఇల్లు చక్కబెట్టుకునే పనిలోనే ఉండిపోయారు. కేసీఆర్ ని తిట్టే ఓపికా, తీరికా లేకుండా పోయింది.

ఇక గ్రేటర్ ఎన్నికలను భుజ స్కంథాలపై వేసుకున్న బండి సంజయ్ పార్టీ నాయకత్వం కూడా నమ్మలేని విజయాలతో అదరగొట్టారు. మొదటి సారి కేసీఆర్ కూడా కొద్దిగా ఉలిక్కి పడ్డారంటారు.

గ్రేటర్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ జోరు పార్టీలో మరింతగా పెరిగింది. తక్కువ కాలంలోనే ఎక్కువ గ్లామర్ సంపాదించుకున్న నేతగా ఎదిగిపోయారు. అది సహజంగానే  పార్టీలోని చాలా మంది సీనియర్లకు కంటగింపుగా మారింది.

బండి సంజయ్ ప్రసంగాలు, వాక్చాతుర్యం, కేసీఆర్ ను ఎదిరించే తీరు, స్టేషన్ల ముందు ధర్నాలు, పాదయాత్రలు, హడావుడీ ఏదో జరిగిపోతుందనిపించే సన్నివేశాలు, ఇవన్నీ అమోఘం అంటారు రాజకీయ పరిశీలకులు.

హుజూరాబాద్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంలో బండి సంజయ్ పాత్ర తక్కువదేమీ కాదు. అన్నింటికీ మించి ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. సాక్షాత్తూ  ప్రధాని నరేంద్ర మోదీయే సభకు తరలి వచ్చిన శ్రేణులను, జనాలను చూసి ముచ్చటపడిపోయారు. భుజం తట్టి తెగ మెచ్చుకున్నారు.

కొద్ది రోజుల క్రితం ఓ సందర్భంలో వెంకయ్యా నాయుడంతటి గొప్పవాడవుతాడని ప్రధాని అనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ పొగడ్తలు బండి సంజయ్ కి ఆనందాన్నిచ్చినా, అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు అసూయ, భయం, కోపాలను కలిగించాయని అంటారు. ఇలాగే వదిలేస్తే మమ్మల్ని దాటేస్తాడనే ఆందోళనతో ఎవరి పావులు వారు కదుపుతున్నట్టు భోగట్టా.

ఇప్పటి వరకు ఆయనకు ప్రత్యర్థులు లేకపోవచ్చు. లేదంటే కనిపించకపోవచ్చు.  ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో బండి సంజయ్ నేరుగా ప్రధాని గుడ్ లుక్స్ లోకి వెళ్లిపోవడం పార్టీలోని సీనియర్లకు నిద్రలేకుండా చేస్తోందంటున్నారు.

ఎందుకంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికోసం చాలా మందే పోటీ పడతారు. వారిలో రాజ్యసభ సభ్యుడు  కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు కూడా ఉంటారు.

అయితే ఈ నేతల్లో ఎవరి గురించి ఏనాడూ ఒక్క పొగడ్త చేయని మోదీ బండి సంజయ్ ని  మెచ్చుకున్నారంటే  మోదీ దృష్టిలో బండి సంజయ్ తురుమ్ ఖానే కదా అంటున్నారు ఆయన వర్గీయులు.

అందుకే ఎన్నికల లోపు బండిని ఎలా వెనక్కి నెట్టాలా అన్న కుట్రలు అప్పుడే మొదలైపోయాయని కమలనాథుల్లోనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్