35.4 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

‘కంగువ’ నుంచి బాబీ డియోల్ లుక్ వచ్చేసింది!

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్. ఇవాళ బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఉధిరన్ లుక్ రిలీజ్ చేశారు.

‘రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్ ..’ అంటూ ఉధిరన్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ బాబీ డియోల్ కు బర్త్ డే విశెస్ చెప్పారు మేకర్స్. ఈ పోస్టర్ లో బాబీ డియోల్ ఉధిరన్ గా యూనిక్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్ కు ఆయన వర్గం ప్రజలంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. విజువల్ వండర్ గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు ‘కంగువ’ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతోంది

నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్