బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్ధమయింది.. రేపు ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్లు తమకు కేటాయించిన హోటల్స్‌కు పయనమయ్యారు.
భారత్, బంగ్లా జట్లు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయి. తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.