- కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలను సందర్శించిన ద్రౌపది ముర్ము
- ఒక మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం గర్వకారణం: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: సమాజంలో మహిళలను చిన్న చూపు చూడకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలు, పురుషులు అందరూ సమానమే అన్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థను సందర్శించారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి… హైదారాబాద్ విమోచన దినోత్సవ ఫోటోలను చూశారు. కళాశాలలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు, చిన్న పిల్లలకు బాల్యం నుంచే సంస్కారం నేర్పించాలన్నారు. పిల్లలకు చిన్నా, పెద్ద, మహిళల పట్ల ఎలా ఉండాలో తల్లి తండ్రులు నేర్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.

ఆజాద్ కా అమృత్ మహోత్సవం పేరిత గొప్ప కార్యక్రమం నిర్వహించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో 30లక్షల జాతీయ పతకాలను ఎగరేసి ఐక్యతను చాటామన్నారు. దేశానికి ఒక మహిళ రాష్ట్రపతి కావడం గర్వకారణం అన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా… రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడం గర్వంగా ఉందన్నారు.