ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాలకొల్లు నుంచి క్రోసూరులో ఎన్టీఆర్ సెంటర్కు చేరుకుంటారు చంద్రబాబు. సత్తెనపల్లి సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకో నున్నారు.


