తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో రేపు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతుండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
నామినేటెడ్ పోస్టులు త్వరగా భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరుపున అభ్యర్థిని ఎవరిని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది.