తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ తెలిపింది. నైరుతు రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాల పడే అవకాశం ఉంది. మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కొమురం భీం, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. వానలకు తోడు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.