స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసిచారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేశినేని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలకు షాక్ ఇస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేను పొగుడుతూ మాట్లాడారు. ఎమ్మెల్యే జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని నాని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందుంటారని వ్యాఖ్యానించారు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కేశినేని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ వర్గాల్లో కేశినేని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.