స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా బాదంపూడిలో గల ఆశ్రమం వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మహానాడుకు వెళుతున్న క్రమంలో కారులో ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మహేష్ యాదవ్ కు గాయాలు అయ్యాయి. కారులో ఉన్న మిగిలిన 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.