తెలుగు దేశం – జనసేన పార్టీల పొత్తుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుద లైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని ..అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.తెలుగు ప్రజల భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ-జనసేన తొలి జాబితాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన విడుదల చేశారు. మొత్తం 118 మంది అభ్యర్థులతో జాబితా తయారైంది. టీడీపీకి 94 స్థానాలు, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో క్లారిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక జనసేన వైపు నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను తర్వాత ప్రకటిస్తామని పవన్ ప్రకటించారు.


