అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టేన్సీ సర్వీస్ మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందిస్తూ… 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. ముంబైలోని టాటా సన్స్ ఆఫీస్ బాంబే హౌస్లో టాటా సన్స్ చైర్మన్ ఎం. చంద్రశేఖరన్తో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. యువగళం పాదయాత్రలో యువనేత, మంత్రి నారా లోకేశ్ ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేసి టాటా గ్రూప్ చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ని రప్పించారు.