26.4 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

‘తారకాసుర -2’ షూటింగ్ ప్రారంభం

కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే… ఆ చిత్రానికి సీక్వెల్‌గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న “తారకాసుర -2” చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది!!

పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా… జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!!

“తారకాసుర సిరీస్”తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ “శ్రీజ మూవీస్” బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. “తారకాసుర-2” చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు!!

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్