స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధంలేదని అంటున్నారని పేర్కొన్నారు. గవర్నర్లు… రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ కొత్త సచివాలయం విషయాన్ని ప్రస్తావించిన తమిళిసై.. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదన్నారు. తాను రాజ్‌భవన్‌లోనే ఉండి అంబేడ్కర్‌కు నివాళులు అర్పించానన్నారు.