19.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

పంటనష్టం భాదితులకు తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టండి: సీఎం కేసీఆర్

CM KCR| అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నేటి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా.. ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఎ ఈ వో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

లిక్కర్‌ కేసులో మళ్లీ కదలికలు.. కేజ్రీవాల్‌, సిసోడియాకు కొత్త చిక్కులు

ఢిల్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ పాలసీ కేసు మళ్లీ ముందుకు కదిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్