హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్‌కి షాకిచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పన్నులు చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులకు చర్యలు తీసుకోకతప్పలేదు.
నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌కు పన్ను బకాయిలు పేరుకుపోయాయి. గత రెండేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. ట్యాక్స్ కట్టాలని పలు మార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.
మొత్తంరూ. కోటి 47 లక్షల వరకు టాక్స్ పెండింగ్‌లో ఉంది. పేరుకుపోయిన పన్ను బకాయిలను చెల్లించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా పన్ను కట్టకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.
నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో తాజ్ బంజారా కూడా ఒకటి. నిత్యం బిజీగా ఉండే ఈ ఫైవ్ స్టార్ హోటల్‌కు వ్యాపార ప్రముఖులు, విదేశీయులు, సినీ తారలు ఎక్కువగా ఇక్కడే స్టే చేస్తుంటారు. ఇక నగరంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా ఆటగాళ్లు ఇక్కడే దిగుతుంటారు. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న హోటల్ పన్ను బకాయిలు కట్టకపోవడం గమనార్హం. అందుకే అధికారులు హోటల్‌కు తాళాలు వేసి సీజ్ చేశారు.