వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తననూ తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశామని, బీఎస్-4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఏపీలో మా దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గరా లేవన్న జేసీ చిన్నచిన్న కారణాలు చూపి బస్సులు సీజ్ చేశారన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారని, రెండు బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారని అన్నారు. తన బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టుకు లాగుతా అన్ను ప్రభాకర్ రెడ్డి
వైసీపీపై తాడిపత్రి ఎమ్మెల్యే ఫైర్
0
174
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


