టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్‌తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచుల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యూ ఏ ఎస్, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మహా టోర్నీలో 20 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా జట్లు సూపర్ 8 కి చేరుకు న్నాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్ కు మ్యాచులు జరగనున్నాయి.