15.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

ప్రమాదానికి గురైన మిలటరీ హెలికాప్టర్

స్వతంత్ర వెబ్ డెస్క్: సిరియాలో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 22 మంది అమెరికా సైనికులకు గాయపడ్డారు. అయితే మిలిటరీ విమానంపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపిన అమెరికా సెంట్రల్‌ కమాండ్‌.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ కమాండ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వెలుపల ఉన్న ఉన్నత సంరక్షణ సౌకర్యాలకు 10 మంది సేవా సభ్యులను తరలించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈశాన్య సిరియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 22 మంది అమెరికా సర్వీస్ సభ్యులకు గాయాలు అయ్యాయని.. గాయాలైన వారికి చికిత్సను అందిస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. శత్రువుల నుంచి ఎటువంటి కాల్పులు జరగలేదని అధికారిక ప్రకటన వెల్లడించింది. అయితే గత మార్చిలో ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలిటెంట్లు చేసిన రెండు దాడుల్లో 23 మంది అమెరికా సైనికుల మెదడుకు గాయాలైనట్లు అమెరికా నివేదిక వెల్లడించింది.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్