స్వతంత్ర వెబ్ డెస్క్: సిరియాలో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 22 మంది అమెరికా సైనికులకు గాయపడ్డారు. అయితే మిలిటరీ విమానంపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపిన అమెరికా సెంట్రల్ కమాండ్.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ కమాండ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వెలుపల ఉన్న ఉన్నత సంరక్షణ సౌకర్యాలకు 10 మంది సేవా సభ్యులను తరలించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈశాన్య సిరియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 22 మంది అమెరికా సర్వీస్ సభ్యులకు గాయాలు అయ్యాయని.. గాయాలైన వారికి చికిత్సను అందిస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. శత్రువుల నుంచి ఎటువంటి కాల్పులు జరగలేదని అధికారిక ప్రకటన వెల్లడించింది. అయితే గత మార్చిలో ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలిటెంట్లు చేసిన రెండు దాడుల్లో 23 మంది అమెరికా సైనికుల మెదడుకు గాయాలైనట్లు అమెరికా నివేదిక వెల్లడించింది.