టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుపై నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్ సహా 24 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్, జోగి రమేశ్ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల అనంతరం జోగి రమేశ్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.