స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్, తనదైన ఆటతో అభిమానులను అలరించిన డైనమిక్ క్రికెటర్ సురేష్ రైనా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ఖండాంతరాలను దాటి విదేశీయులకి భారత్ రుచులను పరిచయం చేస్తున్నాడు. క్రికెట్ కు చాన్నాళ్ల క్రితమే వీడ్కోలు పలికిన ఈ ఘజియాబాద్ వాలా ఇప్పుడు తనకిష్టమైన ఆహార రంగంలోకి ప్రవేశించి యూరప్ నడిబొడ్డున రెస్టారంట్ స్థాపించాడు. ప్రధానంగా ఇది ఇండియన్ రెస్టారెంట్. దీని పేరు రైనా ఎస్సార్. భారతదేశపు నిధి నిక్షేపాల్లాంటి వంటలను వండి వార్చుతామంటూ రైనా హామీ ఇస్తున్నాడు. భారత్ వెలుపల రెస్టారెంట్ ఏర్పాటు చేయడంపై రైనా స్పందిస్తూ.. తనకు ఆహారం అన్నా, వండటం అన్నా పిచ్చి అని వెల్లడించాడు. భారత్ కు మాత్రమే పరిమితమైన నికార్సయిన రుచులను ఆమ్ స్టర్ డామ్ లోని తన రెస్టారెంట్ లో పరిచయం చేస్తానని తెలిపాడు. ఉత్తర భారతదేశానికి చెందిన మసాలా దట్టించిన వంటకాలు, దక్షిణ భారతదేశ ఘమఘమలు తన రెస్టారెంట్ కు వచ్చినవారిని నోరూరించేలా చేస్తాయని వివరించాడు.
విదేశాల్లో రెస్టారంట్ ప్రారంభించిన మాజీ క్రికెటర్
Latest Articles
- Advertisement -