కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి కోర్టుల్లో చుక్కెదురైంది. శిక్షపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సూరత్ సెషన్స్ కోర్టు నిరాకరించింది. అయితే బెయిల్ గడువును మాత్రం పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు విముఖత వ్యక్తంచేసింది.