స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటివరకు టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 8 మ్యాచుల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో నెగ్గి 9వ స్థానంలో ఉంది.